Breaking News | Telangana New CS Santhi Kumari: తెలంగాణ నూతన సీఎస్ గా శాంతి కుమారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారిణి శాంతికుమారి నియమితులయ్యారు. ఆమె 1989 బ్యాచ్ కు చెందిన ఆఫీసర్. తాజా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. శాంతికుమారి... ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాంతికుమారి భేటీ అయ్యారు. ఏప్రిల్ 2025 దాకా ఆమె రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు. ఈమెకు గతంలో సీఎం కార్యాలయంలోనూ సేవలు అందించిన అనుభవం ఉంది.