ఒవైసీతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారు, హైడ్రా ఆగింది - BJP ఎమ్మెల్యే రాజాసింగ్

Continues below advertisement

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులు కూల్చి వేస్తున్నారు. బోరబండ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే...ఈ కూల్చివేతలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఒవైసీ ఫాతిమా కాలేజ్‌ని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాలేజ్‌ని కూల్చివేస్తేనే సీఎం రేవంత్ రెడ్డి హీరో అవుతారని అన్నారు. గత ప్రభుత్వాలు ఒవైసీ బ్రదర్స్‌కి భయపడ్డాయని విమర్శించారు. ఫాతిమా కాలేజ్‌కి ఇప్పటికే నోటీసులు ఇచ్చారని, అయినా కూల్చివేయడానికి ఎందుకింత ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు రాజా సింగ్. ఆ కాలేజ్‌ని ఎప్పుడు కూల్చుతారో ఓ డేట్ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడే హైడ్రా ఆపరేషన్ సక్సెస్ అవుతుందని, లేదంటే ఫెయిల్ అయినట్టే భావిస్తామని తేల్చి చెప్పారు. మిగతా చోట్లకు జేసీబీలు వెళ్తున్నప్పుడు ఆ ఫాతిమా కాలేజ్‌వైపు మాత్రం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు రాజా సింగ్.  
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram