Bathukammakunta Encroachments | ఇప్పటికీ కబ్జా కోరల్లోనే బతుకమ్మకుంట చెరువు..కోర్టులో పరిధిలో వివాదం
హైడ్రా ఏర్పాటైన తరువాత హైదరాబాద్ లో జరిగిన అద్భతం బతుకమ్మ కుంట చెరువు. పూర్తిగా ఆక్రమణకు గురైన 20 ఎకరాల బతుకమ్మ కుంట చెరువును రక్షించింది హైడ్రా. నిర్మాణంలో ఉన్న నివాసభవనాలను కూల్చకుండా బతుకమ్మ కుంటను తిరిగి బ్రతికించింది. దశాబ్ధాలుగా నగరంలో బతుకమ్మ పండుగను బతుకమ్మ కంట చెరువు వద్ద అత్యంత వైభవంగా జరుపుకునేవారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేత కన్న పడటంతో చెరువు కాస్తా, డంపింగ్ యార్డ్ గా మారిపోంది. రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ గా విభజించి అమ్మేశారు. అలా దాదాపు కనుమరుగైన చెరువును, హైడ్రా ఏర్పాటు తరువాత తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చారు. కోర్టులో న్యాయపోరాటం చేసిన హైడ్రా, ఎట్టకేలకు కబ్జా కోరల నుండి చెరువు రక్షించింది. బతుకమ్మలు ఆడేందుకు శాశ్వత ఏర్పట్లు, చెరువు చుట్టూ పెద్ద వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ .. ఇలా ఒకటేమిటి హైదాబాద్ నగరంలో మరెక్కడా లేని విధంగా బతుకమ్మకుంట చెరువు తీర్చిదిద్దింది. ఇంతలా చెరువును అభివృద్ది చేసినా, కబ్జాదారుడు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇది నాభూమే అంటూ కోర్టులో పోరాటం చేస్తూ, వదలబొమ్మాళీ అంటూ బతుకమ్మకుంటను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంటూ స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.