Basara Protest Against Rajesh: అమ్మవారిపై వ్యాఖ్యలు చేసిన రాజేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్
బాసర అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆలయం వద్దే గ్రామస్థులు నిరసన చేపట్టారు. అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ అర్చక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. బాసరలోని శివాజీ చౌక్ వద్ద స్థానికులు ధర్నా చేశారు. రాజేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దుకాణాలు బంద్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాజేష్ పై పిర్యాదు చేశారు.