BASARA MUSICAL STONE: సప్తస్వరాలు ధ్వనించే నిజామాబాద్ జిల్లా బాసర వేదశిల
నిజామాబాద్ జిల్లా బాసరలో ఉన్న వేదశిల సప్తస్వరాలకు నెలవై ఆకట్టుకుంటోంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయానికి వెనుక భాగంలో ఉండే శిల లంకె బిందే ఆకారంలో ఉండటమే కాదు....ధ్వని చేస్తే లంకెబిందెను కొట్టినట్లు శబ్దం వస్తోంది. స్థానికంగా కన్ కన్ బండ గా పిలుచుకునే ఈ మ్యూజికల్ స్టోన్ పై పర్యాటక శాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు. భక్తులను ఆకర్షిస్తున్న ఈ సప్తస్వరాలు పలికించే మ్యూజికల్ స్టోన్ ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటున్నారు.