Bandi Sanjay Stopped By Police: భైంసా వెళ్తున్న బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు
సోమవారం నుంచి నిర్మల్ జిల్లా భైంసాలో... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. యాత్రకు ఇటీవలే ఎంపీ సోయం బాపూరావు అనుమతి కోరగా.... శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్టు పోలీసులు తెలిపారు. భైంసాకు వెళ్తున్న బండి సంజయ్ ను కోరుట్ల సమీపంలోని వెంకటాపూర్ గ్రామ శివార్లలో పోలీసులు అడ్డుకున్నారు.