జలదిగ్బంధంలో భద్రాచలం
Continues below advertisement
ఎగువ నుండి భారీ వస్తున్ననేపథ్యంలో గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 61 అడుగులకు చేరుకుంది.. అధికారాలు అంచనా ప్రకారం 4 నుండి 5 అడుగులు అంటే దాదాపు రాత్రి వరకు 66 అడుగులు చేరుతుంది అని అంచనా... బూర్గంపాడు,దుమ్ముగూడెం , చర్ల మండలాల్లో కొన్ని వేల ఎకరాల్లో పత్తి పంట నీటి మునక లో ఉన్నది..
36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిలిపివేత.. భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు. రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి. గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఈ మేరకు ఆంక్షలు విధించారు. తాజాగా 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్ కానున్నాయి.
Continues below advertisement