Attack on MP K Prabhakarreddy : దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి | ABP Desam
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచారు. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. దాడిచేసిన వ్యక్తిని పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. కడుపులో గాయాలైన కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.