Attack on Bhadrachalam Temple EO | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి చేసిన ఆక్రమణదారులు | ABP Desam

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం దేవస్థానానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని ఖాళీ చేయించేందుకు కొంత మంది కానిస్టేబుళ్లు, అధికారులతో కలిసి ఈవో వెళ్లారు. అయితే భద్రాచలానికి ఆంధ్ర సరిహద్దులో ఉన్న పురుషోత్తమ పట్నంలో ఈ భూములు ఉండటంతో తమ ఆంధ్రా ప్రాంతమని..తెలంగాణ అధికారులకు ఇక్కడ పనేంటంటూ ఆక్రమణ దారులు అడ్డుపడ్డారు. ఇక్కడ ఉన్న 889 ఎకరాల భూమి దేవస్థానానిదే అని...కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు రావటంతో ఇక్కడ పరిశీలనకు వచ్చామని ఈవో చెప్పినా అక్కడి ప్రజలు వినలేదు. ఈవోపై వాగ్వాదానికి నెట్టేసే ప్రయత్నం చేశారు. కానిస్టేబుళ్లు ఈవోకు రక్షణ కల్పించే యత్నం చేసినా తగ్గిన సిబ్బంది లేకపోవటంతో తోపులాటలో స్పృహతప్పిన ఈవో కింద పడిపోయారు. పోలీస్ కానిస్టేబుళ్లు స్థానికుల సహాయంతో ఈవో ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. దేవాలయ భూములను కబ్జా చేయాలని చూస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసులను పెడతామని హెచ్చరించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola