Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటివలే డిసిసి అధ్యక్ష పదవులను ఖరారు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్క్ష్య పదవిని తొలిసారిగా ఆదివాసి మహిళ ఆత్రం సుగుణ పేరును ఖరారు చేసింది. తొలిసారిగా ఆదివాసి మహిళకు డిసిసి అధ్యక్ష పదవి ఖరారు చేయడం పట్ల ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు..? ఆత్రం సుగుణ పుట్టుక ఎక్కడ..? ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలిగా ఏ విధంగా పనిచేస్తూ ముందుకెళ్లబోతున్నారు..? డిసిసి పదవుల కోసం చాలామంది పోటీ పడ్డారు.. అయిన కాంగ్రెస్ అధిస్టానం ఆత్రం సుగుణకు డిసిసి పదవి కేటాయించింది. పోటీలో ఉన్న వారు మీతో కలిసి చేస్తారా.. వారితో మీరెలా నడుచుకుంటున్నారు..? కుమ్రం భీం పోరాట గడ్డ అయిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆదివాసి మహిళ కోవాలక్ష్మి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీరు ఆదివాసి మహిళగా డిసిసి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టారు.. ఈ పంచాయతీ ఎన్నికల్లో మీ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది..? ఈ అంశాలతో ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో abp దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.