Army Jawan Selfie Video | నేను బోర్డర్ లో ఉంటే, తెలంగాణలో నా భూమి దోచుకున్నారు
భారత జవాన్ భూమిని కబ్జా చేసిన వీఆర్వో సోదరుడు.
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి భారత సైన్యంలో పనిచేస్తున్నారు.
తన భూమిని రామస్వామి వీఆర్వో సోదరుడు కబ్జా చేసారని ఒక సెల్ఫీ వీడియోని విడుదుల చేసారు. ఎన్ని సార్లు చేపినా ,మొరపెట్టుకున్నా కూడా ఆర్డీవో కానీ కలెక్టర్లు కానీ... ఎవరు పట్టించుకోవట్లేదని వీడియోలో పేర్కొన్నారు. నేను దేశ సరిహద్దుల్లో పౌరుల కోసం పోరాడుతుంటే, నా సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని చెప్పుకొచ్చారు జవాన్ రామస్వామి.
అయితే సెల్ఫీ వీడియోలో తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు రామస్వామి. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు జవాన్ రామస్వామి.
సంబంధిత అధికారులు వచ్చి తన భూమిని తనకు ఇవ్వాలని, తన తల్లి తండ్రులకు కూడా ఎవరు ఎలాంటి హాని చేయకుండా చూసుకోవాలని సెల్ఫీ వీడియోలో కోరారు జవాన్ రామస్వామి.