ఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లు
APTDC Pancharama Yatra Full Tour: ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ - APTDC (ఏపీటీడీసీ) పంచారామ యాత్రల టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. కార్తీక సోమవారం రోజున ఉదయం 5 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరిన బస్సు యాత్ర రాత్రి 11 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటుంది. అమరావతిలోని శ్రీఅమర లింగేశ్వర స్వామి ఆలయం, అక్కడ నుంచి భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లులోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామంలోగల శ్రీభీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోటలోని శ్రీకుమార రామ స్వామి ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ పంచారామ యాత్ర టూర్ ప్యాకేజీ పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,120 (హైటెక్ నాన్ ఏసీ బస్సు)గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. పంచారామ యాత్ర బస్ రిజర్వేషన్ కోసం tourism.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా వెబ్ సైట్‌లోనే అందించారు. మరింత సమాచారం కోసం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.