Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desam

Continues below advertisement

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బాలుడు శ్రీ తేజ్ పరిస్థితి ఏంటీ..ఏబీపీ దేశం తరపున గడచిన 13రోజులగా ఇదే ప్రశ్నను చాలా సార్లు అడిగాం. అనేక మందితో ఈ విషయాన్ని చర్చించాం. 13రోజులుగా బాలుడు శ్రీ తేజ్ చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. బాలుడి తల్లి రేవతి పుష్ప 2 ప్రీమియర్స్ జరిగిన తొక్కిసలాట కేసులో చనిపోగా..ఆ పిల్లాడు మాత్రం ఈ రోజుకు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కిమ్స్ లో వెంటీలేటర్ మీద చికిత్స జరుగుతున్నా ఈ రోజు వరకూ కనీసం హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేయలేదు. దీనిపైనే ఏబీపీ దేశం ప్రశ్నించింది. అసలు బాబు హెల్త్ బులిటెన్ ఎందుకు రిలీజ్ చేయటం అనే ప్రశ్నకు..ఇప్పుడు స్పందన వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ రోజు శ్రీతేజ్ ను కుటుంబసభ్యులను ఆసుపత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాబు ఆరోగ్యపరిస్థితిపై చాలా మీడియాకు వివరాలు అందించారు ఈ వీడియోలో మీ కోసం

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram