AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు జరిగిన ఓ ఘటనపై బీజేపీ మండిపడుతోంది. సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా తొలుత తెలంగాణ గీతం, తర్వాత వందేమాతరాన్ని సభలో ఆలపించారు. అయితే తెలంగాణ రాష్ట్ర గీతం వస్తున్నప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో AIMIM ఎమ్మెల్యేలు వందేమాతరం ఆలపించే సమయానికి సభ నుంచి వాకౌట్ చేయటం కనిపించింది. ఈ చర్యపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఇది దేశ వ్యతిరేక చర్య అని AIMIM ఎమ్మెల్యేలు యాంటీ నేషనల్స్ లా ప్రవర్తించారని మండిపడ్డారు. త్రివర్ణపతాకంపై గౌరవం లేకపోవటం, వందేమాతరాన్ని తిరస్కరించటం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించటం కింద ఈ ఘటనను పరిగణిస్తామంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పీకర్ ఈ ఘటనపై విచారణ జరపాలని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కేంద్రమంత్రులు డిమాండ్ చేశారు. వందేమాతరం గీతంలో కొత్తగా జోడించిన పంక్తులను పలకటం ఇష్టం లేకనే ఉద్దేశపూర్వకంగా MIM ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola