Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు

Continues below advertisement

ఇక నుంచి మీరు బయట పనీర్‌ కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు పనీర్ అనుకుని కొనేది పన్నీర్ కాకపోవచ్చు.  మీరు పనీర్ అనుకుని తింటున్నది నిజంగా పాలతో తయారైన పనీరేనా..? లేక కూరగాయల కొవ్వులా అన్నది మీకు తెలీదు. 
హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చీజ్ అనలాగ్ అనే ఉత్పత్తిని పనీర్, మలై పనీర్, మిల్క్ పనీర్ పేర్లతో విక్రయిస్తున్నారు. ఈ చీజ్ అనలాగ్ అనేది పూర్తిగా పాలతో తయారయ్యేది కాదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఉత్పత్తులను తీసుకువచ్చి మార్కెట్లో విక్రయిస్తున్నారుఇందులో వెజిటబుల్ ఫ్యాట్స్, ఇతర Non Diary Products వాడతారు.  కానీ రిటైల్ దుకాణాల్లో మాత్రం దీనిని సాధారణ పనీర్‌లా విక్రయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అసలిది పనీరే కాదంటే దీనిని లోఫ్యాట్ పనీర్, ప్రీమియం పనీర్ పేరుతో ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది వ్యాపారులు పనీర్ ఆర్డర్ చేస్తే వారికి తెలియకుండా చీజ్ అనలాగ్ సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు.అంతేకాదు.. కల్తీ తయారీలో స్టార్చ్, అధిక నీరు, పాలేతర కొవ్వులు, నాసిరకం పాలు, కొన్ని సందర్భాల్లో ఆహార వినియోగానికి అనర్హమైన పదార్థాలు కూడా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో చేసిన రైడ్స్‌లో  మొత్తం 45 అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో సుమారు 825 కిలోల అనుమానాస్పద ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola