Adilabad Seasonal Fruits : ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ గా లభించే పండ్లు.. ఉపాధి పొందుతున్న ఆదివాసీలు

Continues below advertisement

అడవుల జిల్లాగా పేరోందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో అడవులే కాదు.. ప్రకృతి ఒడిలో సీజన్ వైజ్ గా వివిధ రకాల పండ్లు ఫలాలు అరుదుగా లభిస్తుంటాయి. ప్రస్తుతం ఈ సీజన్లో బుడంపండ్లు, సీతాఫలాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఉండే అడవి బిడ్డలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో.. సమీప అడవుల్లో నుండి ఈ పండ్లను సేకరించి వారు తినడంతో పాటు మార్కెట్లో, రోడ్డుకిరువైపుల ఫుట్ పాత్ లపై కూర్చొని అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ బుడం పండ్లు సీతాఫలాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు కలుగుతుంది. అదేవిధంగా అడవుల్లో నుండి పండ్లను తీసుకొచ్చి అమ్ముకుంటున్నా అడవి బిడ్డలు ఏ విధంగా జీవనోపాధి పొందుతున్నారు ఈ స్టోరీలో చూద్దాం.ఆ అంటే అడవి.. ఆ అంటే ఆదివాసి.. అడవుల జిల్లాగా పేరోందిన ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులు.. అడవుల్లో అందమైన జలపాతాలు ప్రకృతిని ఆకట్టుకునే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అడవులే కాదు.. ప్రకృతిలో మనకు కాలానుగుణంగా ఎన్నో రకాల పండ్లు, పూలు లభిస్తుంటాయి. కొన్ని సహజ సిద్ధంగా లభిస్తే, మరికొన్ని సాగు చేస్తే వస్తున్నాయి. ఏడాదిలో ఒకసారి సీజన్ వైజ్ గా మనకు కొన్ని పండ్లు ఫలాలు లభిస్తుంటాయి. వేసవిలో ఇప్ప పువ్వు, మొర్రి పండ్లు, ఇతర మరికొన్ని రకాల పండ్లు లభిస్తుంటాయి. అలా సీజనల్‌గా లభించే పండ్లలో బుడుంపండు, సీతాఫలం ప్రస్తుతం అందరికీ లభిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola