Narendra Modi | Adilabad | ప్రధాని మోడీ మమ్మల్ని పట్టించుకోకపోతే.. ఇంకెవరు అభివృద్ధి చేస్తారు?
అడవుల జిల్లా, ఆదివాసీల జిల్లాగా పేరు పొందిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. ఎన్నో వనరులున్నా... ఇక్కడి ప్రజలకు కొన్ని కనీస సౌకర్యాలు ఇప్పటికీ అందని ద్రాక్షలానే మిగిలాయి. జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్, ఆసియాలోనే అతిపెద్ద కాటన్ మార్కెట్, మూతబడిన స్పిన్నింగ్ మిల్, సిమెంట్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్... ఇవన్నీ జిల్లా వాసుల కల. ఈ నెల 4న ఆదిలాబాద్‌కు తొలిసారిగా ప్రధాని మోడీ రావడంతో తమ జిల్లా అభివృద్ధికి కావలసిన హామీలు లభిస్తాయిని ప్రజలు ఆశించారు కానీ ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైంది. తాము కోరుకుంటున్న వాటిలో కొన్నింటిపైనైనా మోడీ ఏదైనా స్పష్టమైన ప్రకటన చేస్తారేమోనని గంపెడాశతో ఎదురుచూసినా... మోడీ మాత్రం వాటిని అసలు ప్రస్తావించలేదు.