Adilabad Ex MP Soyam Bapurao Interview | జీవో నెంబర్ 49కి కారణం కాంగ్రెస్ ఆ..బీజేపీనా..? | ABP Desam

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీఓ 49 పై గత కొద్ది రోజులుగా ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండలాలలో నిరసనలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ నెల21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునివ్వగా బంద్ విజయవంతం అయింది. మరోపక్క మాజీ ఎంపీ సోయం బాపురావ్ సైతం రాష్ట్ర మంత్రులు, గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రిని కలిసి జీవో 49 రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. అయితే ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 49 ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. అయితే జీఓ 49 ను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశారనీ, పూర్తిగా రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని ఇటివలే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ స్పష్టం చేశారు. ఇది కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మభ్య పెట్టే ప్రయత్నమని వాపోతున్నారు. ఈ జీవో 49 ను ఈ నెల చివరి వరకు పూర్తిగా రద్దు చేయకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తాననీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఇంతకి ఈ జీవో 49 తో ఏం నష్టం జరుగుతుంది..?  సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జీవో 49 తాత్కాలిక రద్దు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చేశారనీ అంటున్నారు. దీనిపై పై మీరేమంటారు..? అసలు ఈ జీవో గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్రానికి సంబంధం లేదని ఎమ్మేల్యే హరీష్ బాబు అంటున్నారు నిజమేనా..? ఈ అంశాలపై మాజీ ఎంపీ సోయం బాపురావ్ తో abp దేశం ఫేస్ టు ఫేస్. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola