80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుంది
మనందరికీ ఎమ్మెస్ నారాయణ డైలాగ్ గుర్తుంది కదా...సోడా కొట్టడమంటే పీజీ పాసైనంత ఈజీ కాదు అంటారు ఓ సినిమాలో. ఇక్కడ సీన్ రివర్స్. ఈ పెద్దాయన వయస్సు 81 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్ని పీజీలు ఈయన పాస్ అయ్యారో తెలుసా. అక్షరాలా 20. ప్రస్తుతం 21వ పీజీ చేస్తున్నారు.
జనరల్ గా ఇప్పటి యూత్ ఒక డిగ్రీ నో లేదా పీజీనో పూర్తి చేయమంటేనే అమ్మో నాయనో ఈ చదువులు ఎవడు కనిపెట్టాడురా బాబు అంటూ తెగ ఫీల్ అయిపోతుంటారు. కానీ ఈ పెద్దాయన స్టోరీ డిఫరెంట్. పేరు వీరాస్వామి. వరంగల్ కు చెందిన వీరాస్వామి వయస్సు ఇప్పుడు 80ఏళ్లు...పదవీ విరమణ చేసే చాలా సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ విశ్రాంతి లేకుండా చదువుతూనే ఉన్నారు..పీజీల మీద పీజీలు పూర్తి చేస్తూనే ఉన్నారు.
5 సంవత్సరాల బాలుడిగా పాఠశాల విద్యార్థిగా చదువును మొదలుపెట్టి 80 సంవత్సరాల వృద్ధుడుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా కొనసాగుతున్నారు. 1962 లో పదవ తరగతి పూర్తి చేసి హెచ్ ఎస్ ఈ లో చేరారు. హెచ్ ఎస్ ఈ పూర్తి చేసిన తరువాత 1968 లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందని చదువు ఆపకుండా 1973 డిగ్రీ పూర్తి చేసి పీజీ లు చేయడం మొదలు పెట్టారు. అలా వివిధ యూనివర్సిటీల నుంచి ఇప్పటివరకూ 20పీజీలు పూర్తి చేశారు. ఉద్యోగ విరమణం చెందినా ఈయన అక్షర యజ్ఞాన్ని మాత్రం ఆపలేదు.