BYD MPV E6 : ఒక్కసారి చార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు రయ్...రయ్..
చైనీస్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ మనదేశంలో మొదటి కారును లాంచ్ చేసింది. అదే బీవైడీ MPV ఈ6. ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 520 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లను రూపొందించే బీవైడీ అనే చైనీస్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ MPV కారును మనదేశంలో లాంచ్ చేసింది. మనదేశంలో కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఉత్పత్తి ఇదే. ఇందులో 71.7 KWHబ్లేడ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే డబ్ల్యూఎల్‌టీసీ(సిటీ) రేంజ్‌లో 520 కిలోమీటర్లు, డబ్ల్యూఎల్‌టీసీ(కంబైన్డ్) 415 కిలోమీటర్లను ఈ కారు అందించనుంది.