‘password’యే పాస్‌వర్డా.. ఏం క్రియేటివిటీ సార్ ఇది...
మనదేశంలో ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? ‘password’యేనంట. ఈ విషయం ఒక రీసెర్చ్‌లో తేలింది. దీంతోపాటు ‘iloveyou’, ‘krishna’, ‘sairam’ and ‘omsairam’ పాస్‌వర్డ్‌లు కూడా మనదేశంలో చాలా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారంట.చాలా సింపుల్‌గా ఊహించదగిన న్యూమరికల్, కీబోర్డ్ సీక్వెన్స్‌లను మనదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జపాన్‌లో కూడా ఎక్కువమంది ‘password’నే పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.