Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|

Continues below advertisement

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు, అధిష్ఠానం నిర్ణయాలు మరియు స్థానిక నేతలను ఉద్దేశించి సుస్మిత బహిరంగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. "ఉన్నమాటంటే పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?" అనే చర్చ గాంధీ భవ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది.

కూతురు చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ (TPCC) క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. కొండా సుస్మిత మాట్లాడిన మాటల్లో నిజాలు ఉన్నాయా లేక పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారా? కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు ఎందుకు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు? మంత్రి కూతురికి సొంత పార్టీ నాయకులే హెచ్చరికలు జారీ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు అనే కోణంలో చర్చ సాగుతుంది.  తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరు, కొండా సుస్మిత వ్యాఖ్యల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola