iPhone 15 Overheating: ఐఫోన్ 15 ఎందుకంత వేడెక్కుతోంది? | ABP Desam
ఐఫోన్ 15 డివైజ్ లు విపరీతంగా వేడెక్కుతున్నాయంటూ ఇప్పుడు చాలా మంది కస్టమర్లు పోస్టులు పెడుతున్నారు. ఫోన్ పట్టుకోవడానికి కూడా కష్టంగా ఉండేంత స్థాయిలో హీటెక్కుతోందంటూ టెంపరేచర్ ను రికార్డ్ చేసిన ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఐఫోన్ 15 వాడేవారి కోసం ఐ గ్లోవ్ విడుదల చేసిన యాపిల్ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈ కంప్లైంట్లపై యాపిల్ కూడా స్పందించింది.