Mark Zuckerberg: 7 గంటల విలువ.. 7 బిలియన్ డాలర్ల నష్టం

Continues below advertisement

ఫేస్ బుక్ , ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఏడు  గంటలపాలు పనిచేయక పోవడంతో ఆ సంస్థ భారీగా నష్టపోయింది. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ ను  ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుంచి  ఒక మెట్టు దిగేలా చేసింది. మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద కొన్ని గంటల్లో దాదాపు 7 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది.  సోషల్ మీడియా దిగ్గజం స్టాక్‌ను సోమవారం 5% కు దిగజార్చింది, సెప్టెంబర్ మధ్య నుండి ఇప్పటివరకూ షేర్స్ దాదాపు 15% వరకు పడిపోయాయి. సోమవారం స్టాక్ స్లయిడ్, జుకర్‌బర్గ్ విలువను 120.9 బిలియన్ డాలర్లకు తగ్గించింది, బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో కిందకి పడిపోయారు. ఇండెక్స్ ప్రకారం, జుకర్‌బర్గ్ సంపద  దాదాపు $ 140 బిలియన్ ఉండగా , సెప్టెంబర్ 13 నుండి సుమారు $ 19 బిలియన్ ను కోల్పోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram