Zimbabwe win against australia: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా గెలిచిన జింబాబ్వే | ABP Desam
ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించడం అంత సులువేం కాదు. కానీ, చరిత్రలో తొలిసారిగా కంగారూ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి.. చరిత్ర సృష్టించింది.. జింబాబ్వే. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆ దేశంపై జింబాబ్వేకు ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించింది.దీంతో ఆసీస్ 31 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ చేసిన 141 పరుగుల్లో వార్నర్ చేసిన పరుగులే 94. దీనిని బట్టే చెప్పొచ్చు మిగతా బ్యాటర్లు ఎంతలా విఫలమయ్యారో. ఈ స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే 3 వికెట్ల తేడాతో ఛేదించింది.