Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే

సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంటె వినిపిస్తున్న ఒకే ఒక పేరు అభిషేక్ శర్మ. ఈ సీజన్‌లో అభిషేక్ బ్యాటింగ్ చూస్తుంటే బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. 

అభిషేక్ శర్మ తన సక్సెస్ క్రెడిట్ అంతా యువరాజ్ సింగ్‌కే ఇచ్చాడు. లాక్‌డౌన్ సమయంలో యువీ ఇచ్చిన ట్రైనింగ్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని అభిషేక్ తెలిపాడు. "యువీ పాజీ నన్ను కేవలం ఐపీఎల్ కోసం సిద్ధం చేయలేదు. టీమిండియా తరఫున ఆడేటప్పుడు ప్రెషర్ ను ఎలా హ్యాండిల్ చేయాలి, పెద్ద మ్యాచ్‌లను ఎలా గెలిపించాలో నేర్పించారు" అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.

అలాగే ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి కూడా అభిషేక్ కీలక విషయాలు నేర్చుకున్నాడట. "బాల్ నీ జోన్‌లోకి వస్తే ఫస్ట్ బాల్ నుంచే బాదడానికి వెనుకాడకు" అని హెడ్ ఇచ్చిన సలహా తన గేమ్ ను మరింత మెరుగుపరిచిందని అభిషేక్ వెల్లడించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola