Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సంచలం సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ లో 2023లో టెస్ట్ ఫార్మాట్‌లో డెబ్యూ చేసాడు. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే 171 పరుగులు చేసాడు. ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 2511 పరుగులు చేశాడు.
అయితే జైస్వాల్ డెబ్యూ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను స్వయంగా అతడే వెల్లడించాడు. తన గ్రోత్ లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంత ఉందో వెల్లడించాడు.
టీమ్ఇండియా వెస్టిండీస్‌కు చేరుకున్న వెంటనే జైస్వాల్‌తో రోహిత్ మాట్లాడాడట. ‘నువ్వు డెబ్యూ చేస్తున్నావని మ్యాచ్‌కు ఒక రోజు ముందు చెప్పి నిన్ను ఒత్తిడికి గురి చేయను. 15 రోజుల ముందే చెబుతున్నా. టెస్టుల్లో డెబ్యూ చేస్తున్నావు. ఓపెనర్‌గానే బరిలోకి దిగనున్నావు. ఇందుకు మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండు అని రోహిత్ జైస్వాల్ తో చెప్పాడట.
‘ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. గ్రౌండ్ లో నీ గేమ్ నువ్వు ఆడు. షాట్లు ఆడాలని అనిపిస్తే ఆడేసేయ్. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే మాత్రం దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చేందుకు ప్రయత్నించు.’ అని రోహిత్ శర్మ చెప్పాడని జైస్వాల్ అన్నాడు.
ఇక రోహిత్ శర్మ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల జైస్వాల్ తన తొలి మ్యాచ్‌లో 171 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్ తనకు అన్నయ్య లాంటి వాడని జైస్వాల్ తెలిపాడు.