WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు

Continues below advertisement

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) ఫుల్ జోష్ తో ముందుకెళ్తుంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచిన స్మృతి మంధాన ( Smriti Mandhana ) సేనా ప్లే ఆప్స్ బర్త్  ను కన్ఫర్మ్ చేసుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో గెలిచింది. 

ఆర్‌సీబీ బ్యాటర్ గౌతమి నాయక్ ( Gautami Naik ) హాఫ్ సెంచరీ, అలాగే బౌలర్ సయాలి సత్ఘరే ( Sayali Satghare ) మూడు వికెట్లు పడగొట్టింది. ఆలా ఈ ఇద్దరు ప్లేయర్స్ రెండు ఇన్నింగ్స్ లో రాణించడంతో గుజరాత్ ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ అష్లే గార్డ్‌నర్ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 

వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మూడు మ్యాచ్‌‌లు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola