World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
2026 లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టీమ్ లో శుభ్‌మన్ గిల్ పేరును కూడా బీసీసీఐ చేర్చలేదు. ఇక శుబ్మన్ గిల్ ను సెలెక్ట్ చేయకపోవడం పై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే గిల్ స్థానంలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇలా టీమ్ సెలక్షన్ పై ఎదో ఒక ప్లేయర్ గురించి చర్చ కొనసాగుతూనే ఉంది.
అభిమానుల చర్చలు ఒకేతైతే .. మాజీ క్రికెటర్ల కామెంట్స్ మరోఎత్తు. తాజాగా టీమ్ సెలక్షన్ పై మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ స్పందించారు. యశ్వస్వి జైస్వాల్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
"2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైనవారంతా టాలెంట్ ఉన్న ప్లేయర్స్. శుభ్‌మన్ గిల్ విషయంలో బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తా. అతడికి బదులు ఎవరిని సెలెక్ట్ చేస్తారని మీరు అడిగితే నేను యశస్వి జైస్వాల్ పేరు చెబుతా. తనది క్లాస్ పెర్ఫార్మర్ అని.. పదే పదే నిరూపించుకున్నాడు. టీమ్ లోకి రావడానికి అతడు ఇంకా ఏం చేయాలో నాకు తెలియదు. అయితే ఒక ఫార్మాట్‌లో వరుసగా జట్టు నుంచి తప్పిస్తే.. ఏ ప్లేయర్ అయినా ఇక తన అవసరం జట్టుకు లేదేమోనని అనుకోని కాంఫిడెన్స్ కోల్పోతాడు. గేమ్స్ లో ముఖ్యంగా క్రికెట్‌లో కాంఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం" అని దిలీప్ అభిప్రాయపడ్డారు.