Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలో భారత్ సౌతాఫ్రికా మధ్య టైటిల్ పోరు జరగనుంది. అయితే, ఈ చారిత్రక మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. గతంలో ఇదే స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.
ప్రస్తుతం మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అందువల్ల ఫైనల్, రిజర్వ్ డే ... ఈ రెండు రోజులు మ్యాచ్ కోసం కేటాయించారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ట్రోఫీని ఎవరికీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. టీమ్ ఇండియా, సౌతాఫ్రికా ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్‌ను గెలవలేదు. భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్ ఆడబోతోంది. ఎవరు గెలిచినా కొత్త ప్రపంచ ఛాంపియన్ గా ఉంటారు.
ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ రిజర్వ్ డేను కూడా కేటాయించింది. ఆదివారం మ్యాచ్ జరగకపోతే, సోమవారం రోజున మిగిలిన గేమ్ ఆడొచ్చు. అంటే ఆదివారం రోజున మ్యాచ్ మధ్యలో ఎక్కడైతే ఆగుతుందో... అదే బాల్ నుంచి సోమవారం రోజున అంటే రిజర్వ్ డే రోజు ఆట కొనసాగుతుంది. కుదిరినంత వరకు 50 ఓవర్ల మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఈ రెండు రోజులో వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు టీమ్స్ ను కలిపి విజేతలుగా ప్రకటిస్తారు.