Womens World Cup 2025 | England vs South Africa | ప్రపంచకప్ ఫైనల్‌కు సఫారీలు
Disc : ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ లో మెన్, విమెన్ టీమ్స్ ... 8 సార్లు టోర్నీ సెమీస్ చేరాయి. కానీ ఫైనల్ కు మాత్రం చేరుకోలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో సఫారీలు ఆ ఘనతను సాధించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది దక్షిణ ఆఫ్రికా.
తొలి సెమీస్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా భారీ శతకంతో చెలరేగింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా భారీ స్కోర్ చేసి అవుట్ అయ్యారు. మోతంగా సఫారీలు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటి నుంచే డీలా పడింది. టాప్-3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. సఫారీల బౌలింగ్ ధాటికి నిలవలేక పొయ్యారు. దాంతో 42.3 ఓవర్లలో ఇంగ్లాండ్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఫలితంతో ఇంగ్లాండ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.