Women Chess World Cup Final | FIDE మహిళల ప్రపంచ కప్ భారత్‌దే

FIDE చెస్ ప్రపంచ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారత క్రీడాకారిణిగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి నిలిచింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్ మ్యాచ్  ఇండియా vs ఇండియాగా జరగబోతుంది. ఫైనల్లో భారత్‌ కు చెందిన ఇద్దరు ప్లేయర్స్ దివ్య దేశ్‌ముఖ్‌ కోనేరు హంపి తలపడబోతున్నారు. భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ బుధవారం జరిగిన తలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాన్ జోంగ్జిని ఓడించి మహిళ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ సంచలనం FIDE చెస్ ప్రపంచ కప్‌ ఫైనల్ చేరిన మొదటి భారత క్రీడాకారిణి. 

తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారిణులు ఫైనల్ చేరుకున్నారు. భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్‌ తో ఫైనల్లో తలపడబోతున్నారు. ఇలా ఇద్దరు భారత క్రీడాకారిణుల మధ్య ఫైనల్ జరుగుతుండడంతో ప్రపంచం దృష్టి వీరి ఫైనల్ మ్యాచ్‌పై పడింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకోవడంతో ఈసారి చెస్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవనుంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola