Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి సెలెక్ట్ చేసే భారత టీమ్ లోకి టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో, అక్కడి ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై షమీ ఎక్స్పీరియన్స్ టీమ్ కు చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు.
2003 వన్డే ప్రపంచకప్ ముందు అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన పనినే ప్రస్తుతం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేస్తే షమీ మళ్లీ జట్టులోకి వస్తాడని అంటున్నారు. 2003 వరల్డ్ కప్ ముందే సీనియర్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రిటైర్ అవ్వాలని అనుకోగా, సెలెక్టర్లు కూడా అతనిపై ఆసక్తి చూపలేదు. కానీ గంగూలీ శ్రీనాథ్ అనుభవాన్ని గుర్తించి, సెలెక్టర్లను ఒప్పించి పట్టుబట్టి మరీ జట్టులోకి తీసుకొచ్చాడు. గంగూలీ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల శ్రీనాథ్ అద్భుతంగా రాణించి భారత్ ఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
సెలెక్షన్ కమిటీ ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ప్లాన్ లో షమీ పేరును చేరిస్తేనే సెలెక్ట్ అవుతాడని అంటున్నారు మాజీ ప్లేయర్స్. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలను కేవలం యంగ్ ప్లేయర్లతోనే గెలవడం కష్టం. బుమ్రా, షమీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యం అని ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు.