టీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP Desam

Continues below advertisement

టీ20 వరల్డ్ కప్ ముగిసిపోగానే టీమిండియాలో రిటైర్మెంట్ల వరుస మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరిలో రోహిత్, విరాట్ ప్రపంచ కప్‌లో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశారు. వీరి రిటైర్మెంట్‌తో తర్వాత ఓపెనర్లు ఎవరు అనే అంశంపై చర్చ నడుస్తుంది? ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో ఉన్న సినారియో మొత్తం గమనిస్తే ఈ రెండు ప్లేసుల కోసం నలుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వారే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్.

శుభ్‌మన్ గిల్ ఇప్పటికే వన్డేల్లో స్పెషలిస్ట్ ఓపెనర్‌గా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ టీ20 పూర్తి స్థాయి జట్టులో కూడా గిల్‌కు ఫిక్స్‌డ్ ప్లేస్ లేదు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ గిల్ ఓపెనింగ్ చేశాడు. ఇక యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే... టీ20 వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ దిగాడు. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో స్థానం సంపాదించినా తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. వేగంగా, దూకుడుగా ఆడే మైండ్ సెట్ యశస్వి జైస్వాల్‌కు బలం.

అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటంలో అభిషేక్‌కు ఏమాత్రం వంక పెట్టక్కర్లేదు. ఐపీఎల్‌లో అభిషేక్ ఏ రేంజ్‌లో ఆడాడో ఇప్పటికే అందరం చూశాం. జింబాబ్వే సిరీస్‌లో కూడా కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కానీ ఓపెనింగ్ నుంచి వన్‌డౌన్‌కు వచ్చాక మాత్రం రాణించలేకపోయాడు. వన్‌డౌన్‌లో రెండు మ్యాచ్‌ల్లో కలిపి 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు ఓపెనింగ్ ఛాన్స్ దక్కలేదు. కానీ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. వన్‌డౌన్‌లో, టూ డౌన్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అవసరం అయితే ఓపెనింగ్ కూడా చేయగలడు. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్‌లో రుతురాజ్‌కు ఓపెనింగ్ ఛాన్స్ దక్కడం కష్టమే. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే గిల్, జైస్వాల్ లేదా గిల్, అభిషేక్‌లు ఫుల్ టైమ్ ఓపెనర్లు అయ్యే ఛాన్స్ ఉంది. ఇద్దరూ లెఫ్ట్ అయినా పర్లేదు ఎక్స్‌ప్లోజివ్ స్టార్ట్ కావాలంటే జైస్వాల్, అభిషేక్‌లకు ఛాన్స్ ఇచ్చేయచ్చు. రుతురాజ్ గైక్వాడ్ టాప్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడగలడు కాబట్టి తనకి కూడా జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram