Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

Continues below advertisement

మన ఇండియాలో స్పోర్ట్స్ అంటే అందరికి ముందు గుర్తు వచ్చేది క్రికెట్ మాత్రమే. కానీ క్రికెట్ కాకుండా మన వాళ్లు ఎన్నో గేమ్స్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలుస్తున్నారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చెయ్యట్లేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలయింది. అందుకు కారణం గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఒక వీడియో. ఎంప్టీ స్టేడియం జ్యోతి యర్రాజీ అంటూ వైరల్ అవుతున్న వీడియో మీరు చూసే ఉంటారు. 2023కు చెందిన ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. 

అసలు జ్యోతి యర్రాజీ ఎవరో తెలుసుకుందాం. విశాఖపట్నంకి చెందిన జ్యోతి ఒక వాచ్‌మెన్‌ కూతురు. తండ్రి పేరు సూర్యనారాయణ. తల్లి కుమారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోన్నారు. చిన్నతనం నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా ఒక పక్క చదువుకుంటూనే జ్యోతి అథ్లెటిక్స్‌ లో రాణించింది. 

స్టేట్ లో జరిగే ఈవెంట్స్ జ్యోతి కెరీర్ ను మలుపు తిప్పాయి. హర్డిల్స్ రేస్ లో రాణించాలని హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందింది. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. ఆ తర్వాత జ్యోతి వెన్నకి తిరిగి చుకోవాల్సిన అవసరం రాలేదు. 

2024లో 12.78 సెకన్ల జాతీయ రికార్డు సాధించి. 2023 బ్యాంకాక్ లో Asian Athletics Championships లో గోల్డ్ గెలుచుకుంది. అలాగే  2025 లో సౌత్ కొరియాలో జరిగిన ఆసియన్ గేమ్స్ లో 12.96 seconds లో 100m రేస్ ను ఫినిష్ చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇలా మరెన్నో ఉన్నాయి. గాయం కారణంగా గత కొన్ని నెల్లలుగా గేమ్ కు దూరమైన జ్యోతి 2026 టోక్యో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  

అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో 2023 బ్యాంకాక్ లో Asian Athletics Championshipsకు సంబంధించింది. భారత్ తరపున జ్యోతి యర్రాజీ 100 మీటర్స్ రేస్ ను 13.09 సెకన్లలో ఫినిష్ చేసి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఫైనల్ రేస్‌‌కు వర్షం అంతరాయం కలగడంతో స్టేడియం పూర్తిగా ఖాళీగా ఉంది. 

ఇప్పుడు సోషల్ మీడియా లో .. క్రికెటర్లకు కోట్ల రూపాయలు ప్రకటించే ప్రభుత్వం.. ఇలాంటి ప్లేయర్స్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించినా ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని అంటున్నారు నెటిజన్లు. అభిమానులు కూడా ఇతర క్రీడల వైపు ఆసక్తి చూపించడం లేదని మండిపడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola