Who is Head Coach Amol Muzumdar | ఎవరీ అమోల్ మజుందార్..?

Continues below advertisement

ఉమెన్స్ ఇండియా క్రికెట్ టీమ్ తోలి సారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో శుభారంభం అందుకున్న టీమ్ ఇండియా మధ్యలో మాత్రం చేతులెత్తేసింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి... లీగ్ స్టేజ్ లోనే ఇంటికి  వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా సెమీఫైనల్ చేరుకొని ఆపై ఫైనల్ మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి మ్యాచ్ లోను ప్లేయర్స్ ప్రదర్శన మెరుగవుతూ వచ్చింది. దానికి కారణం టీమ్ ఇండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్. 

అమోల్ మజుందార్ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. కానీ ఇతను ఎవరనేది చాలామందికి తెలియదు. అమోల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీమ్ ఇండియా తరపున ఎప్పుడు ఆడలేదు. అమోల్ తను ఆడిన తోలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే 260 పరుగులు చేసి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. 

డెబ్యూ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 11,000 పరుగులు, 30 సెంచరీలు సాధించాడు. ఇది రంజీ ట్రోఫీలో ఒక పెద్ద రికార్డు. అమోల్ మజుందార్ 
1994లో ఇండియా అండర్ 19 టీమ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్నారు. గంగూలీ, ద్రావిడ్ తో కలిసి ఇండియా ఏ తరపున ఆడారు. ముంబై, అస్సాం, ఆంధ్ర టీమ్స్ తరపున కూడా ఆడారు. 2014 లో రిటైర్మెంట్ ప్రకటించారు. 

బీసీసీఐ 2023 లో అమోల్ మజుందార్ ను భారత మహిళా జట్టు హెడ్ కోచ్ గా నియమించింది. ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో కోచ్ అమోల్ కీలక పాత్ర పోషించారు. తన యంగ్ ఏజ్ లో టీమ్ ఇండియా తరపున ఆడక పోయినప్పటికీ కూడా ఒక కోచ్ గా ఇండియాకు కప్ తీసుకురావడం అనేది మాములు విషయం కాదు. అమోల్ మజూందార్ పేరు భారత మహిళా క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola