West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

Continues below advertisement

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీస్ ప్రస్తుతం **2-2తో సమమైంది. దాంతో బెంగళూరు వేదికగా జరగబోయే ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. సొంతగడ్డపై సమష్టిగా విఫలమై ఓటమిపాలవ్వడం తెలుగు క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. విండీస్ బ్యాటర్ షై హోప్  సెంచరీతో విధ్వంసం సృష్టించగా, రూథర్‌ఫోర్డ్, హెట్‌మైర్ వేగంగా పరుగులు సాధించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సంజూ శాంసన్ అర్ధశతకంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. పవర్ ప్లేలో భారత్ 80 పరుగులు చేసినప్పటికీ, మిడిలార్డర్‌లో వికెట్లు వేగంగా రాలిపోయాయి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేకపోయారు. 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన దశలో, తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి జోడీ ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించి ఆశలు రేపారు. అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola