Virender Sehwag warning to Team India | టీమిండియాకు సెహ్వాగ్ వార్నింగ్

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా అజేయంగా సూపర్-8కు చేరినప్పటికీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) భారత జట్టును హెచ్చరించారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, గట్టి టీమ్స్ తో తలపడేటప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 193 పరుగులు చేసినా, ప్రత్యర్థికి ఏకంగా 176 పరుగులు సమర్పించుకోవడంపై సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు భారత్‌కు గట్టి పోటీ ఎదురవ్వలేదు, అసలైన పరీక్ష సూపర్-8లోనే ఉంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ( Abhishek Sharma ), శివమ్ దూబే ( Shivam Dubey ) వంటి టైమ్ బౌలర్లను కీలక సమయాల్లో వాడటం ప్రమాదకరమని, వారు ఒక్క ఓవర్‌లో 15-20 పరుగులు ఇస్తే మ్యాచ్ చేజారిపోయే అవకాశం ఉందని సూచించారు.

నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ) 9 ఓవర్లలో కేవలం 53 పరుగులే ఇవ్వగా, మిగిలిన బౌలర్లు 11 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు ఇచ్చారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విమర్శలపై స్పందిస్తూ బౌలర్లను వెనకేసుకొచ్చారు. అహ్మదాబాద్‌లో మంచు ప్రభావం బౌలర్లు ఇబ్బంది పడ్డారని, సూపర్-8కి ముందు అందరికీ బౌలింగ్ ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మందితో బౌలింగ్ చేయించామని వివరణ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola