Virat Retired from Test Cricket Format | టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పారు. ఇప్పటికే టీ 20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ... ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. "టెస్ట్ క్రికెట్‌లో నేను తొలిసారి బ్యాగీ బ్లూ డ్రెస్ వేసుకొని 14 సంవత్సరాలు అవుతుంది. ఈ ఫార్మాట్ నన్ను ఇంతలా ముందుకు తీసుకెళ్తుందని నేను అనుకోలేదు. నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, ఎన్నో పాఠాలను నేర్పింది. వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా పర్సనల్ ఫీల్ ఉంటుంది. ఈ ఫార్మాట్ నుండి నేను వైతొలగడం అంత ఈజీ కాదు. కానీ ఇదే కరెక్ట్ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు కోహ్లీ. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు కోహ్లీ.
రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్స్పీరియన్స్ తోపాటు టీం హ్యాండ్లింగ్, ప్రెషర్ లో కూడా గేమ్ ని గెలుపు వైపు తీసుకోని వెళ్ళగలరు. మరి వీళ్లకు తగ్గట్టుగా ఉండే నెక్స్ట్ క్యాప్టియన్ ఎవరు అవుతారు అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. టెస్ట్ కెప్టెన్ అంటే ప్రస్తుతం పేర్లు జస్ప్రీత్ బుమ్రా, శుబ్మన్ గిల్, రాహుల్. వీరి పేర్లు అయితే టెస్ట్ క్యాప్టియన్ రేస్ లో ఉన్నాయి. బుమ్రాహ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన నాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే బుమ్రా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఆడబోయి టెస్ట్ మ్యాచులకు టీం సెలెక్ట్ చేయాలంటే కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అసలే ఇప్పుడు యంగ్ స్టార్స్ పైగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్... సీనియర్లు లేని భారత జట్టు, కొత్త కెప్టెన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి