Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాంచీలో జరిగిన తోలి వన్డే లో విరాట్ కోహ్లీ 135 పరుగులు చేసాడు. కోహ్లీ సెంచరీతో పాటు రోహిత్ శర్మ, రాహుల్ హాఫ్ సెంచరీ చేసారు. కోహ్లీ సెంచరీతో స్టేడియంలో జనం మొత్తం నిలబడి చప్పట్లు కొట్టారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నిలబడి కోహ్లీకి చప్పట్లు కొట్టాడు. ఈ ఒక సెంచరీతో ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆడిన కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు చేసాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
విరాట్ కోహ్లీ 135 పరుగుల ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ మరో పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. భారతదేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధికంగా 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ నంబర్ 3 స్థానంలో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్. దాంతో రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.