Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు

Continues below advertisement

విరాట్ కోహ్లీ అంటే కేవలం రన్ మెషిన్ మాత్రమే కాదు, సూపర్ ఫీల్డర్ కూడా. బాల్ తనవైపు వస్తుందంటే దాని పట్టుకోవడానికి 100 పెర్సెంట్ ట్రై చేస్తాడు. అద్భుతమైన క్యాచ్‌లు, రనౌట్స్‌కు విరాట్ పెట్టింది పేరు. కానీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక తప్పు చేసాడు. అతని మిస్ ఫీల్డ్ కారణంగా గుజరాత్ కు 5 పరుగులు లభించాయి.

జోష్ హజెల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో రెండో బాల్ ను శుభ్‌మన్ గిల్ డిఫెన్స్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. బాల్ కవర్స్ లోకి వెళ్లడంతో, అక్కడే ఉన్న కోహ్లీ వెంటనే బాల్ ను అందుకొని గిల్‌ను రనౌట్ చేయాలనీ కీపర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, ఆ త్రో కీపర్‌కు అందకుండా చాలా దూరంగా వెళ్లడంతో, బాల్ బౌండరీ లైన్ దాటింది. బ్యాకప్ కోసం వెంకటేశ్ అయ్యర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో 5 పరుగులు గుజరాత్‌కు లభించాయి.

ఈ సీన్ చూసి అందరు షాక్ అయ్యారు. తన వల్ల జరిగిన పొరపాటుకు కోహ్లీ గ్రౌండ్ లోనే తీవ్ర అసహనానికి గురయ్యాడు. చివరికి గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీనే పట్టుకునాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola