Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి

Continues below advertisement

టీ20 టెస్ట్ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడుతున్న రెండో వన్ డే సిరీస్ ఇండియా vs సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా సిరీస్ లో వరుసగా రెండు మ్యాచులో డకౌట్ అయిన కోహ్లి, మూడో వన్డేలో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు రాంచిలో కూడా అదే జరిగింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసి ది గోట్ ఈజ్ బ్యాక్ అని మళ్ళి నిరూపించుకున్నాడు. 

అయితే గత కొద్దీ రోజుల నుంచి విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలి అని బీసీసీఐ అతని కోరినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంతో తన ఫ్యాన్స్ కూడా అదే కోరుకున్నారు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో కోహ్లీకి ఎదురైనా ప్రశ్నలో టెస్ట్ కంబ్యాక్ పై స్పందించాడు. 
"నేను ఇక ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడతాను” అని చెప్పాడు. దాంతో ఫ్యాన్స్ పెట్టుకున్న ఒక చిన్న ఆశ కూడా పోయింది. “నా ఆటలో మెంటల్ ప్రిపరేషన్ కీలకం. రోజూ ఫిట్‌నెస్‌లో కష్టపడతా. అది నా జీవన విధానం అయింది. నేను మెంటల్‌గా ఎంజాయ్ అవుతూ, ఫిట్‌గా ఉన్నంత కాలం నేను గేమ్‌ను ఇలాగే కొనసాగిస్తా” అని కోహ్లి చెప్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola