Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్

Continues below advertisement

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా 258 రన్స్ చేసి కూడా ఓడిపోయింది. అయితే జట్టు మ్యాచ్ ఓడిపోయినా కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేదు. అయితే దీనికి కారణం కోహ్లీ సెంచరీ చేయడం మాత్రమే కాదు... గ్రౌండ్లో వింటేజ్ విరాట్ కనిపించడం కూడా. ఈ సిరీస్‌లో ఫస్ట్ రెండు వన్డేల్లో రెండు సెంచరీలు బాదిన కోహ్లీ.. తన కెరీర్‌లో 84వ ఇంటర్నేషనల్ సెంచరీ సాధించి.. సచిన్ టెండూల్కర్‌ 100 అంతర్జాతీయ సెంచరీలు అనే మహా రికార్డుకు మరో అడుగు దగ్గరయ్యాడు. అయితే కేవలం బ్యాటింగ్‌లో ఇరగదీయడమే కాదు.. ఫీల్డింగ్‌లోనూ వింటేజ్‌ విరాట్‌ మార్క్ చూపించి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు. సాధారణంగానే యంగ్ ఏజ్ నుంచి గ్రౌండ్‌లో చాలా ఎనర్జీతో, అగ్రసివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండటం కోహ్లీకి అలవాటు. కానీ ఈ మధ్య కాలంలో టెస్ట్, టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కోహ్లీ చాలా సైలెంట్ అయిపోయాడు. వచ్చామా.. ఆడామా వెళ్లామా.. అన్నట్లు ఉంటున్నాడు. కానీ బుధవారం సఫారీలతో రెండో వన్డేలో మాత్రం.. బ్యాటింగ్‌లో సెంచరీ కొట్టడమే కాకుండా.. గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నంతసేపు.. మళ్లీ తన వింటేజ్‌ మోడ్‌లోకి ట్యూన్ అయిపోయాడు. ఒకప్పటి ఎనర్జీ.. అగ్రెసివ్ నెస్, కాన్పిడెన్స్‌తో కనిపించాడు. వికెట్ పడినప్పుడు అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం.. అపోనెంట్ బ్యాటర్లతో ఫేస్‌ టూ ఫేస్ కావడం.. లాంటి ఎమోషన్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టెయిన్ చేశాడు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌ సింగ్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ ఔటయ్యాక కోహ్లీ చేసిన ‘నాగిన్ డ్యాన్స్‌’ మీమ్ ఫ్యాన్స్‌‌కి తెగ నచ్చేసింది. దీంతో ‘కోహ్లీ స్టైల్ నాగిని డాన్స్ సెలబ్రేషన్స్’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola