Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 | రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు.. ఎందుకంటే.?

Continues below advertisement

Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 | ఓ వంద గ్రాములు...! యావత్ దేశాన్ని కదిలిస్తుందని ఎప్పుడైనా ఊహించారా..! నేడు ఓ వందగ్రాములే యావత్ దేశాన్ని షాక్ కు గురి చేస్తోంది. అసలేం జరిగిందంటే..! పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరి పతకం ఖాయం అనుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్ ను డిస్ క్వాలిఫై చేశారు. ఎందుకంటే.. 50 కేజీగా కేటగిరీలో ఆమె అంత కంటే ఎక్కువ బరువు ఉందట. ఆమె ఎంత ఎక్కువ ఉందంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తాల ప్రకారం వంద గ్రాములేనట. దీంతో.. ఫైనల్ లో పోటీ లేకుండానే ఇంకో ప్లేయర్ గోల్డ్ గెలుచుకుంటుంది. ఇక ఈ పోటీలో ఎవరు సిల్వర్ మెడల్ గెలుచుకోనట్లేనని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..వినేశ్ ఫోగట్ మంగళవారం మ్యాచుల ముందు కూడా 50 కేజీల కంటే ఎక్కువగా బరువు ఉందట. దీంతో..సోమవారం రాత్రి నిద్రపోకుండా సైక్లింగ్, జాగింగ్, స్కిప్పింగ్ లాంటివి చేస్తూ కేలరీలు కరిగించిందట. అప్పుడు వెయిట్ కేజీ కంటే ఎక్కువగా తగ్గిందట. దాంతో క్వాలిఫెయర్స్, సెమిఫైనల్స్ లో ఆడి గెలిచింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram