Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

Continues below advertisement

యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్ ప్లేయర్ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. భారత అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. మొదటి మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్‌లో రాణించలేదు. కేవలం 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

భారత్ అండర్-19 వర్సెస్ దక్షిణాఫ్రికా అండర్-19 వన్డే సిరీస్ కు వైభవ్ సూర్యవంశీ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ తో ఒక పెద్ద రికార్డును తన పేరిట  లిఖించుకున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. వైభవ్ ఇప్పుడు అండర్ 19 కెప్టెన్సీ వహించిన అతి పిన్న వయస్కుడైన ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 14 సంవత్సరాలు 282 రోజులు. ఈ రికార్డు గత 19 ఏళ్లుగా పాకిస్థాన్‌కు చెందిన అహ్మద్ షెహజాద్ పేరిట  ఉంది.

అంతర్జాతీయ అండర్-19 ఏ ఫార్మాట్‌లోనైనా 16 ఏళ్ల లోపు కెప్టెన్సీ వహించిన మొదటి భారత ఆటగాడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా గాయపడటంతో వైభవ్‌కు కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. ఆయుష్, విహాన్ ఇద్దరూ అండర్-19 ప్రపంచ కప్ లో తిరిగి జట్టులోకి వస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola