Vaibhav Suryavanshi Asia Cup Rising Stars 2025 | వైభవ్ సెంచరీ.. బద్దలయిన వరల్డ్ రికార్డ్
టీమిండియా ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డులు బద్దలు చేశాడు. అది కూడా చిల్డ్రన్స్ డే రోజు కావడం విశేషం. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 లో భారత్ ఏ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ... ఐపీఎల్ కంటే తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేసాడు.
యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 297 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో ఏకంగా 144 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి వైభవ్ సూర్యవంశీ ... పది బంతుల్లో మరో 40 పరుగులు రాబట్టాడు. మొత్తం 11 ఫోర్లు, 15 సిక్సర్ల బాదాడు. మేన్స్ టీ20లో అత్యధిక స్ట్రయిక్ రేట్‌తో సెంచరీ చేసిన ప్లేయర్స్ లో నాలుగో స్థానంలో నిలిచాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. టీమ్ ఇండియా తరఫున ఆడుతూ సీనియర్ లెవల్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.