Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్

ఐపీఎల్ 2026లో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అనిపించుకున్న జస్‌ప్రీత్ బుమ్రాకే చుక్కలు చూపించాడు రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు బాది క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచాడు.

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడిన వైభవ్, బుమ్రా బౌలింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "బుమ్రా బౌలింగ్ అంత ఏమీ అనిపించలేదు" అంటూ వైభవ్ చేసిన స్టేట్‌మెంట్ హాట్ టాపిక్‌గా మారింది.

"నేను బౌలర్ ఎవరు అని చూడలేదు, కేవలం బంతిని మాత్రమే చూసి కొడతాడు. బుమ్రాను చూడగానే కాస్త కంగారు పడ్డాను కానీ, నా ఇన్స్టింక్ట్ పై నమ్మకం ఉంచాను." అంటూ చెప్పుకొచ్చాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు దగ్గరి నుంచి వేగంగా బంతులు విసరడం వల్ల, మ్యాచ్‌లో బౌలర్లను ఎదుర్కోవడం సులభమైందని వైభవ్ తెలిపాడు. "నేను గనుక ఇన్నింగ్స్ మొత్తం ఉండి ఉంటే స్కోరు ఇంకా భారీగా ఉండేది" అని ఈ యువ ఆటగాడు ధీమా వ్యక్తం చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola