Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ

Continues below advertisement

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అఫీషియల్‌గా అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ తన డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. 

కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే టీమిండియాకు ఆడి, మెన్స్ లేదా ఉమెన్స్ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన వరల్డ్ రికార్డును వైభవ్ క్రియేట్ చేశాడు. ఈ రాకతో ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా ఉన్న ఆల్-టైమ్ గ్రేట్ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. 

సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాక్‌పై డెబ్యూ చేయగా.. అతని కంటే ఒక ఏడాది ముందే వైభవ్ ఇండియా జెర్సీ ధరించడం విశేషం. అయితే, వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఈ చారిత్రాత్మక మైలురాయి రోజున టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైభవ్ అద్భుతమైన రికార్డ్‌తో భారత్ సంబరాలు చేసుకున్నప్పటికీ, మ్యాచ్ ఫలితం మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola