Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్

ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లను వణికిస్తున్న రాజస్థాన్ రాయల్స్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయసులోనే స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఇద్దరు చిన్న పిల్లలతో చేసిన ఫన్నీ ప్రాంక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైభవ్‌తో ఫోటో దిగడానికి ఇద్దరు చిన్నారులు వచ్చారు. ఆ పిల్లల కోసం  వైభవ్ ప్రాంక్ స్టార్‌లా మారిపోయి.. "నాతో ఫోటో దిగాలంటే ఫ్రీగా కుదరదు, ఒక్కో ఫోటోకి 100 రూపాయలు ఇవ్వాలి" అని ఫన్నీగా డిమాండ్ చేశాడు. దానికి ఆ పిల్లలు ఏమాత్రం తడబడకుండా "మేము 200 రూపాయలు తెచ్చాము" అని సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. 

వెంటనే వైభవ్ నవ్వుతూ తను తమాషాగా అన్నానని చెప్పి, ఆ పిల్లలతో ఫోటోలు దిగాడు. డిగ్ అవుట్ లో ఎంత సరదాగా ఉన్నా గ్రౌండ్‌లోకి దిగితే మాత్రం వైభవ్ వేరే లాగా మారిపోతాడు అని అంటున్నారు. పాట్ కమిన్స్, బుమ్రా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ వంటి బౌలర్లను కూడా వదలట్లేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola