Under19 World Cup Team India | టీమిండియా హ్యాట్రిక్ విజయం

Continues below advertisement

అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2026లో ( Under-19 ODI World Cup 2026 ) టీమిండియా జోరుమీద ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది. భారత అండర్ 19 టీమ్ 204 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను ( Zimbabwe ) చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్రా ( Vihan Malhotra ) 107 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) 30 బంతుల్లో 52 పరుగులు చేసాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే ( Captain Ayush Matre ) మరోసారి నిరాశపర్చాడు.

అనంతరం జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. భారత్ చేసిన 352 పరుగుల్లో జింబాబ్వే ( India vs Zimbabwe ) సగం కూడా చేయలేకపోయింది. బ్యాటింగ్ తో నిరాశపరిచిన కెప్టెన్ ఆయుష్ మాత్రే బౌలింగ్‌లో చెలరేగాడు. మూడు కీలక వికెట్లను పడగొట్టి పతనానికి కారణమైయ్యాడు. భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola